ప్రజావాణి పిర్యాదులు పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల యొక్క సమస్యల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన పిర్యాదులు పరిష్కారం, పెండింగ్ అంశాలపై త్వరలో తహిల్దారులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలని, జాప్యం చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు కొన్ని: మణుగూరు మండలం, బగత్సింగ్నగర్కు చెందిన సమద్, సాబీర్, వహాబ్, కరీం మరి సుల్తాన 9-1-376 నెంబరు. గల ఇంటిలో 40 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నామని, మా ఇల్లు బిటిపిఎస్ రైల్వేలైను ఏర్పాటులో పోయినదని, అట్టి ఇంటికి నష్టపరిహారం చెల్లించు విధంగా చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేయగా తగు చర్యలు తీసుకోవాలని భూ సేకరణ విభాగపు పర్యవేక్షకులను ఆదేశించారు. పాల్వంచ మండలం, జగన్నాధపురం గ్రామానికి చెందిన మాజోత్ శంకర్ జగన్నాధపురం గ్రామంలో హై స్కూల్ నిర్మాణానికి తన తండ్రి కోక్యా పాఠశాల నిర్మాణానికి భూమి విరాళంగా ఇచ్చారని తనకు అదే పాఠశాలలో ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టు ఇప్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం విద్యాశాఖ అధికారికి ఎండార్స్ చేశారు. బూర్గంపాడు మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన బూరం శ్రీనివాసరావు లక్ష్మీపురం గ్రామంలోని సర్వే నెం. 440/ 4,5,6,7లో 6.26 ఎకరాలు భూమి పూర్వికుల ద్వారా వారసత్వంగా సంక్రమించిందని, అట్టి భూ వివరాలు నూతన పట్టాదారు పాసుపుస్తకంలో నమోదు కానందున రైతుబంధు రావడం లేదని, ఈ యొక్క సర్వే నెంబర్లులోని భూమిని పాసుపుస్తకంలో నమోదు చేయించాల్సిందిగా చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ధరణి కో ఆర్డినేటర్‌కు ఎండార్స్ చేశారు. | అశ్వారావుపేట మండలం, వాస్తవ్యురాలు శ్రీమతి జి కృష్ణవేణి తన అత్త విజయలక్ష్మి కోతమిషన్ బజారులో అంగన్వాడీ టీచర్‌గా పనిచేయుచూ అక్టోబర్ 2వ తేదీన ఆకస్మిక మృతి చెందారని, నిరుపేదలమైన మాకు ఆమె యొక్క వేతనమే జీవనాధారమని, కావున ఆమె ఉద్యోగం తనకు ఇప్పించాల్సిందిగా చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం జిల్లా సంక్షేమ అధికారికి ఎండార్స్ చేశారు.. యనబోయిన కొర్రయ్య గత 20 సంవత్సరాల నుండి వృద్యాప్య పింఛను పొందుతున్నానని, 10 నెలల క్రితం నాయొక్క పించను నిలిపివేశారని, యంపిడిఓ కార్యాలయంలో తాను మరణించినట్లు తప్పుగా నమోదు చేయడం వల్ల తనకు పించను రాకుండా పోయిందని, కావున విచారణ నిర్వహించి తనకు పింఛను మంజూరు చేయాల్సిందిగా కోరుతూ చేసిన దరఖాస్తులను తగు చర్యలు నిమిత్తం డిఆర్డిఓకు సిఫారసు చేశారు. కొత్తగూడెం మండలం, మేదరబస్తీకి చెందిన బి. కవిత తన భర్త ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం, వల్ల మరణించారని, నేటి వరకు తనకు ఎటువంటి పరిహారం అందలేదని, ఆశా కార్యకర్తగా పనిచేయుచున్న తాను ఏయనం కోర్సు చదివి ఉన్నందున తనకు ఏయన్యం ఉద్యోగ అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తును వైద్యాధికారికి, డిఆర్డిఓకు, ఆర్టీఓకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ అశోక్ చక్రవర్తి, డిఆర్డిఓ మధుసూదన్‌రాజు, డిపిఓ రమాకాంత్, వైద్యాధికారి డాక్టర్ శిరీష, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు

Share This Post