ప్రజావాణి ఫిర్యాదులకు అధికారులు తొలి ప్రాధాన్యం ఇచ్చి వారి నమ్మకాన్ని నిలబెట్టాలని అదనపు కలెక్టర్ తిరుపతి రావు ఆదేశించారు.    

సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు ఫిర్యాదులు స్వీకరించారు.

వివిధ సమస్యలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావుకు దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో దరఖాస్తు చేస్తే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతో  వివిధ మండలలా నుంచి  ప్రజలు ప్రజావాణికి వచ్చి తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో ఇస్తారని, వాటిని సంబంధిత జిల్లా అధికారులు సత్వరమే స్పందించి పరిష్కారం చేయాలని ఆదేశించారు.  ప్రజావాణి ఫిర్యాదులకు అధికారులు తొలి ప్రాధాన్యం ఇచ్చి వారి నమ్మకాన్ని నిలబెట్టాలని ఆదేశించారు.

ఈ రోజు ప్రజావాణి ద్వారా మొత్తం  45 ఫిర్యాదులు వచ్చాయని వాటి పరిష్కారానికి  సంబంధిత శాఖలకు  పంపిస్తున్నట్లు తెలియజేసారు.

ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post