ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 47 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుడి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. ఇందులో ప్రధానంగా భూ వివాదాలు, ధరణికి సంబంధించి 26 వినతులు రాగా వివిధ సమస్యలకు సంబంధించి 21 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై తీసుకున్న చర్య గురించి ఫిర్యాదుదారులు తప్పనిసరిగా సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషద్ సీఈఓ శైలేష్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, డిపిఓ తరుణ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి. గంగయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ వేణుగోపాల్ రావు, డి.టి.ఓ. చిన సాయిలు, డీఈఓ రమెహ్ కుమార్, శ్రీనివాస్ రావు, మైన్స్ ఏ.డి. జయరాజ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post