ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించండి: జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించండి: జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్

– ప్రజావాణి కి ఫిర్యాదుల వెల్లు

– వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం గా ఉండాలి


——————————-
ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.

సోమవారం IDOC మీటింగ్ హల్ జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజల వినతులు, ఫిర్యాదులను ఆయన అదనపు కలెక్టర్ స్వీకరించారు.

మొత్తం 140 దరఖాస్తులు రాగా భూ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.
ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం చేయాల్సిందిగా సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…
ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ఆయా శాఖలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు. దూరప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజల పట్ల మానవతా దృక్పథంతో సానుకూలంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజావాణి అన్న విషయం మరిచిపోరాదన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వారంలోగా పరిష్కరించాలని, ఏదేని పరిష్కారం కాని పక్షంలో అందుకు గల కారణాన్ని అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఆయా శాఖల వద్ద పెండింగ్‌లో గల ఫిర్యాదులు, విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా  అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు.   వరద చేరే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని లన్నారు.

 

ప్రజావాణి లో శిక్షణ కలెక్టర్ శ్రీ ప్రపుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
——————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్ధిపేట చే జారీ చేయనైనది

Share This Post