ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి :

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులకు సూచించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయన ప్రజావాణికి హాజరై మాట్లాడారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు,
వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ————— జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.20.12.2021
Revenue 41
Agricultural 3
Dpo2
Irrigation 1
SP office 2
DRDO 2
Total 51

Share This Post