ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – కలెక్టర్ పీ ఉదయ్ కుమార్

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు వారం రోజుల్లో పరిష్కరించి ఆన్లైన్ లో వివరాలు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లొ ప్రజల ఫిర్యాదులను అదనపు కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ రెవెన్యూ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి తీసుకున్నారు. నేటి ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చిన 15 మంది తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కు విన్నవించుకున్నారు.
భూ సమస్యలపై 9 వినతులు, మైనింగ్ కు సంబంధించిన 3 వినతులు, జిల్లా పంచాయతీ, పోలీస్, మునిసిపల్ లకు సంబంధించి ఒక్కో వినతి పత్రాలు అందించారు.
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
వచ్చే సోమవారం నుండి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ ప్రజావాణి కి హాజరు కావాలని ఆదేశించారు.

Share This Post