ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ప్రజావాణి అర్జీలను వెంటదివెంట పరిశీలన జరుపుతూ వాటిని సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ప్రధానమంత్రి 15సూత్రాల పథకం అమలు, పల్లె ప్రగతి సన్నద్ధత, మన ఊరు-మన బడి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు.
———————-

Share This Post