ప్రజావాణి ఫిర్యాదులపై శ్రద్ధ వహించాలి – అదనపు కలెక్టర్ యం. మను చౌదరి

ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై దరఖాస్తు చేసుకున్న ప్రజల ఫిర్యాదులను, విజ్ఞప్తులను సంబంధిత శాఖల అధికారులు సత్వర పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద వహించాలని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ యం. మను చౌదరి అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించి, పరిష్కార మార్గాలను సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతాలలో అపరిష్కృతంగా ఉన్న 242 ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
వివిధ సమస్యలపై వచ్చిన 11 వినతి పత్రాలను ఆయన స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post