ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించే బాధ్యత మండలాల ప్రత్యేక అధికారులదే – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించే బాధ్యత మండలాల ప్రత్యేక అధికారులదే – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

 

ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించేలా మండలాల ప్రత్యేక అధికారులు ప్రత్యేక చొరవ చూపి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) మెతిలాల్ తో కలిసి ప్రజా వినతులు, ఫిర్యాదులను కలెక్టర్‌ స్వీకరించారు.

ఈ మేరకు ప్రజావాణికి 37 దరఖాస్తులు వచ్చాయి.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..

ప్రజలు సమస్యలతో ప్రజావాణిలో అందించిన ఫిర్యాదులను ఆయా  మండలాల జిల్లాస్థాయి ప్రత్యేక అధికారులు తాహసిల్దార్లు, మండల అభివృద్ధి అధికారులతో చర్చించి, క్షేత్రస్థాయిలోనే ఆయా ఫిర్యాదులను  ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మండల ప్రత్యేక  అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ప్రజావాణి నుంచి అర్జీలు తీసుకోవడమే కాకుండా వాటి పరిష్కారాలను ప్రతి శనివారం లోపు తెలియజేయాలన్నారు.అధికారులు అందరూ విధిగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి తప్పక హాజరు కావాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నర్సింగరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

…………………………..జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం నాగర్ కర్నూలు నుండి జారీ చేయడమైనది.

Share This Post