పత్రిక ప్రకటన
తేదీ : 02–05–2022
ప్రజావాణి ఫిర్యాదులు, వినతులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి
ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 67 విజ్ఞప్తుల స్వీకరణ
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణిహాల్లో ప్రజల వద్ద నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను వారు అదనపు కలెక్టర్ శ్యాంసన్ డీఆర్వో లింగ్యానాయక్తో కలిసి స్వీకరించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో 67 విజ్ఞప్తులు రాగా అందులో ప్రధానంగా భూసమస్యలు, పెన్షన్ వంటివి ఉన్నాయి. ఈ సందర్భంగా సంబంధిత వినతులు, ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు అందచేస్తూ వాటిని వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్యాంసన్ సూచించారు. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని, అందరు అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుందని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.