పత్రిక ప్రకట
తేదీ : 25–04–2022
ప్రజావాణి ఫిర్యాదులు, వినతులకై ప్రాధాన్యతనివ్వాలి
ప్రజావాణిలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 68 విజ్ఞప్తుల స్వీకరణ
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ప్రజావాణిహాల్లో ప్రజల వద్ద నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను వారు స్వీకరించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను వింటూ తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అడిషనల్ కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.