ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: అదనపు కలెక్టర్ లు

 

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: అదనపు కలెక్టర్ లు

 

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్ అధికారులకు సూచించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

అనంతరం వారు అధికారులతో మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని, కాబట్టి అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

 

కాగా ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 37 ఫిర్యాదులు,వినతులు వచ్చాయి.

ప్రజావాణిలో ఆర్డీఓ లు టి శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.

Revenue – 17
Handloom – 1
DPO – 3
Mines – 1
Mc, sirccilla – 1
MPDO Vemulawada – 1
Irrigation – 1
MPDO Chandurthi – 1
MPDO Musthabad – 1
MPDO Yellareddypet – 1
MPDO Thangallapalli – 3
Municipal Vemulawada – 2
MPDO Konaraopet – 2
MPDO Vemulawada rural – 2

——————————

Share This Post