ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన ఐడిఓసి లోని ఆడిటో రియంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 34 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.
Revenue -20
R&B – 1
DPO- 1
Surevy -1
LDM -1
Mc Vemulwada – 1
MC Sircilla – 4
Irrigation -1
MPDO Konaraopet – 1
DWO -1
MPDO Thnagallapali- 1
ED Sc Corporation -1
TOTAL – 34
కార్యక్రమంలో ఇంచార్జి డి.ఆర్.ఓ టి. శ్రీనివాస్ వేములవాడ ఆర్.డి.వో. పవన్ కుమార్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.