ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు.

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన ఐడిఓసి లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన పిర్యాదులను ప్రత్యక్షంగా తానే స్వీకరిస్తూ పిర్యాదుదారులతో నేరుగా మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేశారు. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన ఫిర్యాదులను సంబంధిత తహసీల్దార్,ఎం పి డి ఓ ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆదేశించారు. అదేవిధంగా జిల్లాస్థాయి అధికారుల ద్వారా పరిష్కారం అయ్యే ఫిర్యాదుల విషయంలో సంబంధిత జిల్లా అధికారిని తన వద్దకు పిలిపించుకొని ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశించారు .

కాగా గత సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు కాగా, ఈ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద మొత్తంలో పిర్యాదుదారులు వచ్చారు .ఈ ఫిర్యాదులలో వ్యక్తిగత సమస్యలతో పాటు, భూములకు సంబంధించినవి, ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు, తదితర అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు అందాయి.
ఆర్డిఓ అనిల్ కుమార్ ,స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ ,డిఆర్డిఓ యాదయ్య ,జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

 

Share This Post