ప్రజావాణి మొత్తం దరఖాస్తులు:- 63


పత్రిక ప్రకటన:-
సిద్దిపేట 06 ఫిబ్రవరి 2023

ప్రజావాణి మొత్తం దరఖాస్తులు:- 63

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన అర్జిదారుల నుండి జిల్లా అదనపు పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వస్తున్నారని అంతే నమ్మకంగా అర్జిదారులకు న్యాయం చేసే విదంగా పని చెయ్యాలని జిల్లా అధికారులకు సూచించారు. భూ సంబంధిత, రెండు పడకగదుల ఇండ్లు, ఆసరా పింఛన్లు ఇతర మొత్తం కలిపి 63 దరఖాస్తులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
issued by district public relations officer siddipet district

Share This Post