కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో జిల్లాలో ప్రజావాణి నీ రద్దుచేస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు తెలిపారు
ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు.
తదుపరి సమాచారం తెలిపే వరకూ ప్రజావాణి రద్దు ఉంటుందన్నారు.
కోవిడ్ కేసులు అధికం అవ్వడం, వ్యాప్తి వేగంగా జరుగుతుండడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు
జిల్లా ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ ప్రకటనలో కోరారు.