ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు.

ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి విన్నాపాలు స్వీకరించారు. ప్రజలు నిర్భయంగా దరఖాస్తులు తమ సమస్యలపై చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలియజేశారు. ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 39 దరఖాస్తులు ప్రజల నుండి స్వీకరించనైనదని, అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి హరి సింగ్, డిఆర్డిఎ పిడి సంపత్రావు, జడ్పీ సీఈఓ రాజారావు, అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

????????????????????????????????????
????????????????????????????????????
????????????????????????????????????

Share This Post