పత్రిక ప్రకటన తేది: 06-12-2021
ప్రజావాణి లో వచ్చిన పిర్యాదులను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రఘురాం శర్మ అధికారులకు ఆదేశించారు.
సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జరిగిన ప్రజావాణి లో జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి పిర్యాదులను అదనపు కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణి లో మొత్తం 62 పిర్యాదులు వచ్చాయని తెలిపారు. పిర్యాదులు ఎక్కువగా ధరణి సమస్యలు, పాస్ బుక్ లు, ఆసరా పెన్షన్ లకు సంబంధించిన పిర్యాదులు వచ్చాయని, పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు.
సమావేశం లో జిల్లా అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.
—————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారిచే జారి చేయనైనది.