పత్రికా ప్రకటన తేదీ: 11-10-2021
ప్రజావాణి లో వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులకు ఆదేశించారు.
సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన కన్వర్జేన్సి సమావేశం లో మాట్లాడుతూ ప్రజల నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వివిధ అంశాలకు సంబందించిన సమస్యలు వెంటనే పరిష్కరమయ్యేటట్లు చూడాలని, వచ్చిన దరకాస్తులను పరిష్కరించి రిపోర్ట్ పంపించాలన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రతి నెల రెండవ మంగళవారం మండలం వారిగా రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని విల్లెజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ (VCPC) ఎజెండా తయారు చేసుకొని, కమిటీ ఏర్పాటు చేయాలనీ, కమిటీ సమావేశం నిర్వహించి చైల్డ్ లేబర్, బాల్యవివాహాలు, పోక్సో కేసుల పై చర్చించాలని అన్నారు. కమిటీ సమావేశం లో గ్రామ ప్రజలను కూడా భాగస్వాములను చేసి సమస్యల పై చర్చించాలని అన్నారు. గ్రామం లో ఎంత మంది పిల్లలు ఉన్నారు, వారి గురించి పూర్తి వివరాలు పంచాయతి కార్యదర్శి మరియు సర్పంచు లకు తెలిసి ఉండాలని అన్నారు. డ్రాప్అవుట్ అయిన పిల్లలను తిరిగి పాటశాలలో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అంగన్వాడి స్కూల్స్ లో ఉండే పిల్లలో ఎంత మంది ఆరోగ్యంగా ఉన్నారని , అందరికి బాలామృతం, పౌష్టికాహారం అందిస్తున్నారా , న్యూట్రిషన్ పరంగా చేపట్టే చర్యల పై వివరణ ఇవ్వాలని అన్నారు. పాటశాలల్లో రక్త హీనత కలిగి ఉన్న పిల్లలను గుర్తించి వారికి మాత్రలు ఇవ్వాలని అన్నారు. మధ్యాహ్న భోజనం లో ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, వంటి పోషక ఆహారము మాత్రమే పెట్టాలని డి ఇ ఓ కు ఆదేశించారు,. వివిధ శాఖలకు సంబంధించిన అఫీషియల్ ఫంక్షన్స్ , ప్రారంభ కార్యక్రమాలు ఉంటే ప్రోటోకాల్ ను అనుసరించి స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని తెలిపారు.
అదనపు కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ వి సి పి సి కమిటి లో పంచాయతి సెక్రటరీ, సర్పంచ్, పాటశాల ఉపాద్యాయులు, పోలీస్ , రెవిన్యూ, వార్డు మెంబర్ లు ఉండి గ్రామ కమిటి సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. మండల స్పెషల్ అధికారులు ఈ కమిటి లో పాల్గొంటారని అన్నారు.
అనంతరం ప్రజావాణి పిర్యాదులను స్వీకరించారు. ఈ రోజు మొత్తం 70 ప్రజా పిర్యాదులు వచ్చాయని , వాటిలో ఎక్కువ భూ సమస్యలు వచ్చాయని , వాటిని సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కారమయ్యేలా చూస్తామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.
సమవేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయడమైనది.