ప్రజావాణి లో వచ్చిన ప్రజా పిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

ప్రజావాణి లో వచ్చిన ప్రజా పిర్యాదులను తక్షణమే పరిష్కారం  చేసే దిశగా  చర్యలు  తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు నిర్వహించిన ప్రజవాణికి  ప్రజలు  వివిధ ప్రాంతాల నుండి  వచ్చి అందించిన ప్రజా పిర్యాదులను స్వీకరించారు.  ప్రజావాణి పిర్యాదులు మొత్తం 46  వచ్చాయని, ఎక్కువగా ధరణి  సమస్యలు, ఆసరా పెన్షన్ ల కోసం , వివిద అంశాలపై  దరకాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని  వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.   వివిధ అంశాల పై వచ్చిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని పిర్యదుదారులకు హామీ ఇచ్చారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  జిల్లా గారిచే జారీ చేయనైనది.

 

 

 

Share This Post