ప్రజావాణి లో స్వీకరించిన ధరకాస్తు త్వరితగతిన పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

* ప్రచురణార్థం * ఏటూరునాగారం డిసెంబర్ 13 ( సోమవారం)

పెండింగ్లో ఉన్న ప్రజావాణి సమస్యలపై దృష్టిపెట్టి
పరిష్కార దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు ఇంచార్జి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు .
సోమవారం రోజున ఎటునాగారం ఐటిడిఏ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి సంబంధిత గిరిజనుల నుండి విన్నపాలు స్వీకరించి పరిష్కార దిశగా అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు గిరిజనులకు సకాలంలో
అందించాలంటే గత ప్రజావాణిలో ప్రజలు అందించిన సమస్యలపై పెండింగ్ లేకుండా పరిష్కారం చేసినట్లయితే సాధ్యమైనంత వరకు న్యాయం చేసిన వాళ్లమవుతాం అని అన్నారు. ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా అధికార యంత్రాంగం పని చేస్తుందని జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈరోజు ప్రజావాణిలో ప్రజల నుండి తీసుకున్న దరఖాస్తులు కొన్నింటిని తెలియజేయడమైనది.
చల్ పాక ఎంపీటీసీ కోటా నరసింహులు ఎలి శెట్టి పల్లి వయా కొండాయి వాగు మేడారం జాతర రోడ్డు కల్వర్టు మంజూరు గురించి దరఖాస్తు సమర్పించారు.
మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన జానీ పట్ల మౌనిక ఎస్సీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల ఎంపికలో తనకు సమాచారం తెలియలేదని దరఖాస్తులు సమర్పించారు.
మహాలక్ష్మి ఆదివాసి ఇసుక కోరి లేబర్ కాంట్రాక్టు సహకార సంఘం ఆధ్వర్యంలో 2019 సంవత్సరంలో ఇసుక క్వారీ నిర్వహణకు సంబంధించిన బిల్లులు మంజూరు గురించి దరఖాస్తులు సమర్పించారు.
భయ్యా క పల్లి గ్రామం సమ్మక్క తల్లి మినీ మేడారం జాతర జాతరలో ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గుడి ప్రాంగణం లో కలర్, లైటింగ్ ఏర్పాటు చేసిన వాటికి బిల్లులు మంజూరు కాలేదు అని దరఖాస్తు సమర్పించారు.
కేజీబీవీ వెంకటాపురం పాఠశాలలో ఏఎన్ఎం పోస్ట్ ఖాళీగా ఉన్నదని అర్హత మేరకు నాకు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వెంకటాపురం మండలం పాలెం గ్రామానికి చెందిన సోడే ఆదిలక్ష్మి దరఖాస్తును సమర్పించారు.
ప్రజలు అందించిన అర్జీలను ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కార దిశగా చర్యలు చేపడతామన్నారు.

మేడారం జాతర లో ఎన్ని షాపు లు ఉన్నాయి వాటి, వాటి పూర్తి బాధ్యత పంచాయితీ అధికారుల దని, షాపులలో వస్తువులు ఎమ్మార్పీ రేటు కి అమ్ముతున్నారా లేదా, మ్యానుఫ్యాక్చరింగ్ తేదీలు ఉన్నాయాలేదా అనే వాటి పైన దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు.

మేడారం జాతరలో ఎలక్ట్రానిక్ కాటాలు, అతి పురాతనమైన నాణ్యతలేని తూకం రాళ్ళు తక్కెడ లతో వ్యాపారస్తులు వివిధ వస్తువులు, తినుబండారాలు, విక్రయించి గిరిజనులను మోసం చేసే అవకాశం ఉన్నందున అట్టి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి తునికలు కొలతల అధికారులు చేత తనిఖీలు నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు
ములుగు,ఏటూరు నాగారం బస్టాండ్ పరిసర ప్రాంతాలు, టాయిలెట్స్ ఎప్పటికప్పుడు మెయింటెన్ చేయించాలని
ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల బిల్డింగ్స్ లో ఏవైనా రిపేర్ ఉన్నట్లు, అయితే త్వరగా చేయించాలని పిల్లలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని,జిల్లా సంక్షేమ అభివృధి శాఖ అధికారిని భాగ్యలక్ష్మి ని ఆదేశించారు.
గిరి వికాసం కి సంబందించిన ధరకాస్తు పెండింగ్ ఉండరాదని ప్రాజెక్ట్ అగ్రికల్చర్ అధికారిణి లక్ష్మి ప్రసన్నను ఆదేశించారు. అనంతరం సఖి భవనం క్రిస్మస్ కి ప్రారంభించుట కు సిద్దంగా ఉండాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత ను ఆదేశించారు. అలాగే అంగన్వాడి సెంటర్స్ ప్రభుత్వ బిల్డింగ్స్ లో ఎన్ని ఉన్నాయి, ప్రైవేటు స్థలాలలో ఎన్ని ఉన్నాయి పూర్తి వివరాలు తయారు చేసి పూర్తి నివేదికలు సమర్పించాలని అన్నారు.

జిల్లాలో ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయి, వాటిలో ఎంత పెండెన్సి ఉన్నది. ససరం క్యాంపుల వివరాలు సంబంధిత కార్యాలయాల్లో డిస్ప్లే బోర్డ్ ద్వారా ప్రజలకు తెలియపరిచే లా చేయాలని సంబంధిత అధికారుల ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి, డి ఆర్ వో రమాదేవి ,ఏ పీ ఓ జనరల్ వసంతరావు, SDC శ్రీరాములు, డి ఆర్ డి వో నాగపద్మజా, జిల్లా వెటర్నరీ అధికారి విజయ్ భాస్కర్, ఎస్సి కార్పొరేషన్ ఇడి రవి, డి యం &హెచ్ ఓ అప్పయ్య, సంబంధిత జిల్లా అధికారులు itda యూనిట్ అధికారులు పాల్గొన్నారు

Share This Post