ప్రజావాణి విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రజావాణి విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

—————————————

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన విజ్ఞప్తులు, సమస్యలకు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సత్వర పరిష్కారం చూపేలా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు ప్రజల సమస్యలపై స్పందించి సత్వర పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల వినతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ లో దరఖాస్తులు ఉంచకుండా చూడాలని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. కాగా సోమవారం ప్రజావాణిలో ప్రజల నుండి మొత్తం 2 అర్జీలు వచ్చాయి.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post