ప్రజలకు అభివృద్ధి పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేయడమే కాకుండా, సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తుల పరిష్కార దిశగా అధికారులు కృషి చేయాలని,ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను అదేశించారు.
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులను అదనపు కలెక్టర్లు మను చౌదరి, శ్రీనివాసరెడ్డి లతో కలిసి ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
ప్రజావాణిలో మొత్తం 46 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 26 వినతులు రెవెన్యూ సమస్యలు, మిగతావి వివిధ శాఖలకు సంబంధించినవని ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.