ప్రజావాణిలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని ఆదనపు కలెక్టర్ .వి.చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు పంపినట్లు తెలిపారు. దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు వారు సూచించారు.
ఈ కార్య క్రమం లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ, నల్గొండ నుండి జారిచేయనైనది.
ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ప్రజావాణికి 50 ధరఖాస్తులు అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్