ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదు దారులు తమ సమస్యలకు సంబంధించి అందించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు పంపినట్లు వారు తెలిపారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో డి.అర్. ఓ.జగదీశ్వర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నల్గొండ వారిచే జారీ చేయడమైనది.
ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి