ప్రజావాణి సమస్యలు వెంటనే పరిష్కరించాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రజావాణి సమస్యలు వెంటనే పరిష్కరించాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

ప్రజావాణి సమస్యలు వెంటనే పరిష్కరించాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

—————————-
పెద్దపల్లి, మార్చి -20:
—————————-
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ ఇచ్చిన అర్జీలను పరిశీలన చేసి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకొని వారి నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

గోదావరిఖనిలోని విఠల్ నగర్ కు చెందిన పి.మమత తన భర్త కూలి పని చేసుకుంటూ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో ఫిబ్రవరి 11వ తేదీన మృతి చెందారని, తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా డిపిఎం పెన్షన్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

శ్రీరాంపూర్ మండలం మిర్జాంపేట గ్రామానికి చెందిన పి.సరిత తాను దివ్యాంగురాలినని తనకు రెండు పడకల గదుల ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే తన పేరున భూములు లేకున్నా ఉన్నట్లు తప్పుడు నివేదిక ఇచ్చారని, తప్పుడు నివేదిక ఇచ్చిన రెవెన్యూ పరిశీలకులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ పునర్విచారణ చేసి దివ్యంగుల కోటాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా శ్రీరాంపూర్ తహసిల్దార్ కు రాస్తూ వెంటనే విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామానికి చెందిన జి.శ్రీనివాస్ తన తండ్రి గుండేటి వెంకటేశం 2002 ఫిబ్రవరి 7 నాడు మరణించారని, పంచాయతీ రిజిస్టర్ లో నమోదు చేయలేదని, ప్రస్తుతం తన తండ్రి పేరు మీద ఉన్న ఇండ్లు తమ పేరుపై మార్చుటకు తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం అవసరం ఉన్నందున విచారణ చేసి మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి మార్చి 25 నాటికి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

పెద్దపల్లి గ్రామానికి చెందిన ఆకుల భాగ్యమ్మ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 363/1 లో గల 0.09 గుంటల భూమి తమ మామ గారికి చెందిందని దానిని తన పేరుపై మార్చి పట్టా పాస్ బుక్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పెద్దపల్లి తహసిల్దార్ కు రాస్తూ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి మార్చి 25 నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

సింగరేణి ఆర్జి3, ఓపెన్ కాస్ట్ మైనింగ్ క్వారి -2 విస్తరణలో భూములు, గృహాలు కోల్పోయిన లత్నాపూర్ భూ నిర్వాసతులు తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో పాటు,
ప్లాట్ లు ఇవ్వటం జరిగిందని, అట్టి ప్లాట్ లలో డ్రైనేజ్ డైవర్షన్, దేవాలయం, కమ్యూనిటీ హాల్ ,అంగన్వాడి సెంటర్, గణేష్ మండపం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహిళా భవనం, గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామం, సెంట్రల్ లైటింగ్, విద్యుత్ దీపాలు, ఆర్వో ప్లాంట్ మొదలైన అభివృద్ధి పనులు చేయాలని, 18 సంవత్స రాలు నిండిన యువతీ, యువకులకు ఎక్స్గ్రేషియా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, మంథని రెవెన్యూ డివిజన్ అధికారికి రాస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను మార్చి 28 నాటికి సమర్పించాలని కలెక్టర్ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post