ప్రజావాణి సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలి….. అదనపు కలెక్టర్ వీరారెడ్డి

 

ప్రజావాణి సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలి….. అదనపు కలెక్టర్ వీరారెడ్డి

ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారం పై అధికారులు దృష్టిసారించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా నలుమూలల నుండి అర్జీదారులు కలెక్టరేట్కు తరలివచ్చారు. జిల్లా రెవిన్యూ అధికారి రాధిక రమణి తో కలిసి అదనపు కలెక్టర్ వీరారెడ్డి ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ అర్జీలను అందజేశారు.

భూ సమస్యలకు సంబంధించి ఎక్కువ మంది అర్జీలు సమర్పించగా, ఆర్థిక సహాయం, రుణాలు, పింఛన్ల మంజూరీ, ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ల కోసం అదనపు కలెక్టర్ కు పలువురు అర్జీలను అందజేశారు.

ఈ సందర్భంగా వీరా రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వివిధ సమస్యలకు సంబంధించి అందజేసిన అర్జీలను ఆయా శాఖల అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. వెనువెంటనే పరిష్కరించాల్సిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో డి అర్ ఓ, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post