ప్రజావిజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి

ప్రజావిజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి

—————————————-

వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైడే కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలు, వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా గ్రామాల్లో చేపట్టాలని సూచించారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం క్రమం తప్పకుండా డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

సోమవారం ప్రజావాణిలో ప్రజల నుండి మొత్తం 16 అర్జీలు వచ్చాయి.

కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఇంచార్జి డి.ఆర్.ఓ శ్రీనివాస్ రావు,
వేములవాడ ఆర్డీఓ వి.లీల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

——————————————-

Share This Post