ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—2 తేదీ.20.9.2021

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల , సెప్టెంబర్ 20:- జిల్లాలోని ప్రజల సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఐ. ఎం.ఏ. హాల్ నందు జిల్లా కలెక్టర్ ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి 20 వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని తెలియచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు G.O.Ms.No. 52, GA (I&PR) Dept, Dt:14-02-2017 లోని ఆదేశాల మేరకు ప్రభుత్వం శాఖల ద్వారా జారీచేసే ప్రతి అడ్వర్టైసెమెంట్ ను శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ ద్వారా మాత్రమే జారీ చేయవలసినదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఆర్.డి.ఓ.కొరుట్ల, జగిత్యాల , జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ జి. రవి.

జిల్లా పౌర సంబంధాల అధికారి, జగిత్యాల చే జారీచేయబడినది.

Share This Post