ప్రజాసమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన..3 తేదిః 18-11-2021
ప్రజాసమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, నవంబర్ 18: వివిధ సమస్యల పరిష్కారం కొరకు వచ్చే ధరఖాస్తులపై అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ రెవెన్యూ అంశాలపై, అధనపు కలెక్టర్ ఎసి.ఎల్.బి, ఆర్డిఓలు మరియు తహసీల్దార్ లతో జూమ్ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కార్యాలయాలలో ఎటువంటి పెండింగ్ పనుల లేకుండా చూడాలని, భూములపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో అధికారలు బాగా పనిచేశారని, అక్రమ ఇసుక రవాణ జరుగకుండా చూడాలని అన్నారు. ఓటరు జాబితాలో చనిపోయిన వారిని గుర్తించి వాటి కుటుంభ సభ్యుల ద్వారా ఫాం 7 తీసుకొని వివరాలను తొలగించి జాబితాను సవరించాలని సూచించారు. కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ ధరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకుంటు ఎక్కడకూడా కారణాల ద్వారా ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలని, బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటి ల వారిగా వచ్చిన నిధుల ప్రకారం చెక్కులను లబ్దిదారులకు అందించాలని సూచించారు. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా నమోదైనప్పుడు, కోర్టు కేసులు, సీలింగ్ భూములపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి, పాతరికార్డుల ద్వారా పూర్తి అవగాహన పొందిన తరువాత చర్యలు తీసుకోవాలని సూచించారు. భూముల రిజిస్ట్రేషన్ కొరకు స్లాట్ బుక్ చేసుకోన్న వాటిలో పెండింగ్ లేకుండా చూడాలని, పెండింగ్ లో ఉన్న పిపిబి కోర్టు కేసులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. Ts b Pass ఆదేశాలకు మీరి ఎటువంటి నిర్మాణాలు జరుగకుండా ఎల్లప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణాల మొదటి దశలోనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజాసమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
ప్రజాసమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post