ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని   జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత  అధికారులను ఆదేశించారు.  

ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని   జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత  అధికారులను ఆదేశించారు.
సోమవారం నాడు కలెక్టర్ కలెక్టరేట్  సమావేశ మందిరంలో  ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు.  వివిధ సమస్యలపై ప్రజల నుండి (85) వినతులు అందినట్లు అయన తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్, డి ఆర్ ఓ వాసు చంద్ర, జిల్లా అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Share This Post