ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం నాడు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి 58 వినతులు అందినట్లు తెలిపారు.

రెవిన్యూ శాఖ 20, ఎస్సి కార్పొరేషన్ 6, డీఆర్డీఓ 5, 2బి హెచ్ కె 5, డిసిఎస్ ఓ 3, లేబర్ డిపార్ట్మెంట్ 4, ఇతర శాఖల కు సంబంధించి నవి15.

ప్రజల నుండి వినతులను స్వీకరించి, వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు.
అర్జిలను వెంటనే పరిష్కరించాలని, ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవిన్స్ నాటికి రిపోర్ట్ సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ కు వస్తున్న దరఖాస్తుల పురోగతిపై కలెక్టరేట్ సిబ్బంది , దరఖాస్తులకు నెంబర్ కేటాయించి పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో డి ఆర్ ఓ వాసుచంద్ర, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post