ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ప్రజాస్వామ్యం దేశంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకొని మంచి ప్రజా నాయకులను ఎన్నుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు.
మంగళవారం ఉదయం జాతీయ ఓటర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, అధికారులతో భారతదేశ పౌరులమయిన మేము, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత నిస్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభావాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం మొదటిసారి ఓటు హక్కు పొందిన బాదం భావన, పీ ఇందు, రాఘవ వరప్రసాద్ రామ్ రెడ్డి లకు ఓటర్ ఎపిక్ కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, డిపిఆర్ఓ సీతారాం, ఆర్డిఓ నాగలక్ష్మి, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post