ప్రజాస్వామ్యంలో పవిత్రమైనది, ఎంతో విలువైనది ఓటు హక్కు అని ,18 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన యువతీ యువకులు అందరు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రికా ప్రకటన                                                          తేదీ 25- 1- 2023

ప్రజాస్వామ్యంలో పవిత్రమైనది, ఎంతో విలువైనది  ఓటు హక్కు అని ,18 సంవత్సరాలు వయస్సు  పూర్తి అయిన యువతీ యువకులు అందరు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

బుధవారం జిల్లా కల్లెక్టరేట్  సమావేశము హాలు నందు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన  ఆడియోను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. 18 సంవత్సరాలు పూర్తి అయిన  ప్రతి ఒక్కరు  ఓటు హక్కును ఓటరు జాబితా లో  నమోదు చేసుకోవాలని  అన్నారు. ప్రజా స్వామ్యం ఫై విశ్వాసం తో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కులం ,మతం ,వర్గం ,భాష ,ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండగ నిర్భయంగా ఓటు హక్కు ను వినియోగించుకోవాలని తెలిపారు. ఓటరు గా  తమ బాధ్యత నిర్వహించుటకె  ఓటరు గుర్తింపు కార్డు పొందాలని ఓటు హక్కు ను వినియోగించుకొని ప్రజా స్వామ్యాన్ని పటిష్ట పరచాలని తెలిపారు. ఓటరు హెల్ప్ లైన్  డౌన్ లోడ్ చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల ద్వారా  ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని అన్నారు.   ఈ సందర్భంగా పలు పాటశాలలో నిర్వహించిన  వ్యాసరచన పోటీలలో గెలుపొందిన 1.  కె. బిందు , జాడ్ పి ఎచ్ ఎస్  , కొండేరు ప్రధమబహుమతి,  2.జి. నందిని  అమరవాయి ద్వితీయ బహుమతి, 3.శిరీష  ఆలంపూర్ తృతీయ బహుమతులను విద్యార్థులకు అందజేశారు. ముగ్గురు విద్యార్థులను   కలెక్టర్ అభినందించారు. జిల్లా లో నూతన ఓటర్ గా పేరు నమోదు చేసుకున్న  వర్షిత్ నీల్ రాజ్  కు  కలెక్టర్ చేతుల మీదుగా ఓటరు ఐ డి కార్డు అందజేశారు. ఇంకా కొంత మందికి ఓటరు ఐ డి కార్డులలో చిరునామా  మార్చిన ఓటరు ఐ డి కార్డులను  అందజేయడం జరిగింది.

అనంతరం జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు , కల్లెక్టరేట్ సిబంది అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సమావేశం లో ఆర్ డి ఓ రాములు, సి పి ఓ లక్ష్మన్, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, ఎం ఆర్ ఓ వెంకటేశ్వర్లు , సుపరింతెన్దేంట్లు రాజు, మదన్  మోహన్ , వరలక్ష్మి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల చే  జారీ చేయబడింది.

 

Share This Post