ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదేనని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదేనని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు.
బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ ‘భారత దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంతి ఎన్నికల ప్రాభవాన్నినిలబెడతామని మతం, కులం, వర్గం, భాష ఎటువంటి ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని’ వివిధ శాఖల అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా గారి సందేశం వినిపించారు.
జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంటుందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నాయకుని ఎన్నుకోవాలని సూచించారు. ఓటు హక్కును కలిగి ఉండడం ప్రథమ కర్తవ్యమని అదే విధంగా దాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమపేర్లను నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.
అనంతరం స్వీప్ నోడల్ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ మీ ఓటే మీ స్వరం,మీ భవిష్యత్తుకు నాంది అని, ఎటువంటి ప్రలోభాలకు లొంగక ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఏడాది ఓటును మించినది లేదు – నేను తప్పక ఓటు వేస్తాను అని అంశంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని అన్నారు. కాగా ఎన్నికల సంఘం ఇప్పుడు ఏడాదిలో 4 సార్లు అనగా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదుకు అవకాశం కల్పించడంతో పాటు 17 సంవత్సరాలు నిండిన యువత కూడా ముందస్తుగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని అన్నారు. ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదుతో పాటు, 6-బి ద్వారా ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ లింక్ చేసుకోవలసిందిగా సూచించారు
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి,జిల్లా షెడ్యూల్డ్ సంక్షేమ అధికారి రామరావు, జిల్లా ఎస్.సి.కార్పొరేషన్ అధికారి ప్రవీణ్ కుమార్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ పి. కృష్ణ కుమార్, వివిధ శాఖల అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post