ప్రజాస్వామ్య దేశంలో ఓటు చాలా విలువైనదని, ఎన్నికలు నిర్వహణలో ఓటు వజ్రాయుధమని జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు ఈ శ్రీధర్ తెలిపారు. 

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో  నియోజకవర్గ రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, నాయబ్ తహసీల్దార్లు, బూత్ స్థాయి అధికారులతో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుందని చెప్పారు. ఓటరు  రికార్డుల నిర్వహణ బావుందని అభినందించారు.   జిల్లాలో ఓటర్ల సంక్షిప్త సరవణ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ ఆధ్వర్యంలో మంచిగా జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా ఓటరు జాబితా సరవణలో.మరణించిన వ్యక్తులు, పోలింగ్ కేంద్రం పరిధి నుండి  ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వ్యక్తుల  మార్పులు, చేర్పులు తొలగింపులుపై వచ్చిన క్లయిమ్స్ ను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. ఇప్పటి వరకు అందిన క్లయిమ్స్ ను డిశంబరు 20 వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన రికార్డును పకడ్బందీగా నిర్వహించాలని, నియోజకవర్గంకు సంబంధించిన రికార్డు మొత్తం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయంలో భద్రపర్చాలని సూచించారు. ఓటరు జాబితాకు సంబంధించిన రిజిస్టర్లు మరియు రశీదులు పకడ్బందీగా ఉంచాలని సూచించారు. సవరణ ప్రక్రియ పూర్తయిన తదుపరి  తుది ఓటరు జాబితాను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించి రశీదు పొందాలన్నారు. ఓటర్ల సంక్షిప్త సవరణకు సంబంధించి బూత్ లెవల్ అధికారులచే పరిశీలించబడిన క్లెయిమ్స్  తప్పనిసరిగా బూత్ లెవల్ అధికారి ధ్రువీకరణ చేయాలని చెప్పారు.  అనంతరం సూపర్ వైజర్లు ఏ.ఇ.ఆర్.ఓల ద్వారా సమర్పించాలని ఆయన సూచించారు.  కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్  మాట్లాడుతూ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో 1-11-2021 న ముసాయిదా జాబితా ప్రచురించడం జరిగిందని, నూతన ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులకై నవంబరు 6,7  నవంబరు 27, 28వ తేదీలలో నాలుగు రోజులు స్పెషల్ క్యాంపెన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఐదు నియోజక వర్గాల పరిధిలో 1089 పోలింగ్ కేంద్రాలున్నాయని, అదనంగా 3 కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.   1-11-2021 న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా ననుసరించి జిల్లాలో 9  లక్షల 9 వేల 747 మంది ఉన్నారని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని ఐదు నియోజక వర్గాల పరిధిలో ఫారం-6కు సంబంధించి 3093, ఫారం-7కు సంబంధించి 3432, ఫారం-8కు సంబంధించి 834, ఫారం-8 ఏకు సంబంధించి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్వో అశోక్ చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, అన్ని మండలాల తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రాజు, సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post