ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు

. మంగళవారం 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశపు హాలులో ఓటుహక్కు ప్రాధాన్యత, ఎన్నికలు నిర్వహణ, నూతన ఓటర్లుకు ఓటుహక్కు వినియోగంపై అవగాహన, యువ ఓటర్లుకు ఎన్నికల గుర్తింపు కార్డులు పంపిణీ, వయోవృద్ధులైన ఓటర్లుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుహక్కు చాలా విలువైనదని, అందువల్ల ఎన్నుకొనే ప్రతినిధిని వివేకంతో ఎన్నుకోవడానికి ప్రతి ఎన్నికలో పాల్గొనాలని ఆయన ఓటర్లుకు సూచించారు. మన ఎన్నికల వ్యవస్థ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని, ఎన్నికల సమయంలో ఇతర దేశాల అధికారులు మన ఎన్నికల సంఘం యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటుందని అంతటి పేరు ప్రఖ్యాతులు మన సంఘానికి ఉన్నాయని చెప్పారు. మన దేశంలో ఎన్నికలు నిర్వహణ ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం ప్రధానమైనదని, భారత ఎన్నికల సంఘంలో ఓటరుగా నమోదైనందుకు గర్వపడాలని చెప్పారు. పేద, ధనిక బేదం లేకుండా కుల, మత ప్రాంతీయ బేదం లేకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్చగా, నిర్భయంగా నిశ్చంతంగా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటు నుండి నేటి వరకు ఎన్నో మార్పులు వచ్చాయని ఈ క్రమంలోనే ప్రక్రియ నిర్వహణకు ఈవియంలు, వివిపాట్లు వినియోగిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగం రహస్యంగా జరుగుతుందని చెప్పారు. మన దేశంలో పోలింగ్ ప్రక్రియ విడతలు వారిగా నిర్వహించడం జరుగుతుందని, మొత్తం ప్రక్రియ పూర్తి అయిన తదుపరి లెక్కింపు ప్రారంభించి విజేతలను ప్రకటిస్తారని చెప్పారు. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు హెల్ప్ లైన్, ఓటరు పోర్టల్ యాప్లు అందుబాటులోకి తెచ్చి ఓటర్లుకు విశిష్ట సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ యాప్లు వినియోగం ద్వారా ఓటరు అసెంబ్లీ నియోజకవర్గం మరియు పోలింగ్ కేంద్రాలను తెలుసుకోవడం, యాప్ ద్వారా సేవలను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఈ హెల్ప్న్ యాప్ వినియోగం ద్వారా బూత్ నేవిగేటర్ మ్యాపులో పోలింగ్ బూతక్కు వెళ్లాల్సిన మార్గాన్ని కనుగొనడం, ఓటరు జాబితాలో పేరును పరిశీలించుకోవడం, పోలింగ్ అధికారులను తెలుసుకోవడం, ఓటరు ఐడి కార్డులో మార్పులు, చేర్పులు కోసం దరఖాస్తు చేసుకోవడం, సదరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇల్లు మారినందుకు దరఖాస్తు చేసుకోవడం వంటి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం ప్రతిజ్ఞ భారతదేశ మైరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్చువల్ ద్వారా భారత ఎన్నికల సంఘ కమిషనర్ సుశీల్ చంద్ర ఓటర్లుకు తన సందేశాన్ని వినిపించి జాతీయ ఓటరు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల నిర్వహణ, ఓటుహక్కు వినియోగం అంశాలపై నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ, బొమ్మలు, ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, ఎన్నికల సంఘానికి సంబంధించిన సమాచారపు పుస్తకాలను అందచేశారు. అనంతరం వయోవృద్ధులైన ఓటర్లును శాలువాలతో ఘనంగా సత్కరించారు.

 

నూతన ఓటర్లకు ఎన్నికల గుర్తింపు కార్డులు అందచేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ అశోకచక్రవర్తి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, ఆర్టీఓ స్వర్ణలత, ఎన్నికల విభాగం

 

సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post