ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటర్ల దే కీలక పాత్ర…,.. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

 

ప్రతి ఓటరు తమ ఓటు హక్కును బాధ్యతగా , స్వేచ్ఛాయుతంగా వినియోగించుకోవాలి

ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటర్ల దే కీలక పాత్ర…,.. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటర్లదే కీలక పాత్ర యని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 12 వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్చగా వినియోగించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.

ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియన్నారు. దేశ భవిష్యత్తును ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఓటర్ల నమోదు, ఓటర్లను చైతన్యవంతులను చేయడంలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు.
నూతన ఓటర్లు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకున్ని ఎన్నుకోవాలన్నారు. ఓటు హక్కు స్వేచ్ఛగా , ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని యువతకు సూచించారు.

ఈ సందర్భంగా అందరిచే “భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్యం సాంప్రదాయాలను, స్వేచ్చాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష , ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాధిక రమణి, ఎన్నిక ల విభాగం సూపర్డెంట్ పాషా, ఎన్నికల విభాగ సిబ్బంది, నూతన ఓటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post