You Are Here:Home→ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి, అర్హులైన ఓటర్లను ఓటర్ జాబితాలో లో పేరు నమోదు చేసేలా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి, అర్హులైన ఓటర్లను ఓటర్ జాబితాలో లో పేరు నమోదు చేసేలా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో “13వ. జాతీయ ఓటర్ల దినోత్సవం- 2023” ను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ 18 సం.లు పూర్తైన ప్రతి ఒక్కరు ఓటర్ గా తమ పేరును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.ఓటర్ గా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించు కోవాలని భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఒక మంచి వ్యక్తిని తమ ప్రతినిధి గా ఎన్నుకునే హక్కు ఓటర్ కు మాత్రమే ఉన్నదని ఆయన గుర్తు చేశారు.ముఖ్యంగా అర్హులైన యువత ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలని సూచించారు.పారం 6 ద్వారా ఓటర్ గా నమోదు చేసుకోడం తో పాటు 6 బి ద్వారా ఓటర్ కార్డు కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు.ఎన్నికల సంఘం నుండి రూపొందించిన
“మై భారత్ హూ ” పాట ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. మనదేశంలో యువత ఎక్కువగా ఉన్నదని, దేశ భవిష్యత్తును నిర్ధారించే హక్కు ప్రతి ఒక్క ఓటర్ కు ఉన్నదని ఆయన తెలిపారు.ఎన్నికల సమయం లో సి.విజిల్ యాప్ ను వినియోగించుకొని ఎన్నికల సంబంధిత పిర్యాదులు పై కూడా అవగాహన కలిగించాలని, ఓటర్ గా నమోదు పై ఈ.అర్. ఓ.లు,తహశీల్దార్ లు గ్రామాలలో విస్తృత ప్రచారం కల్పించాలని, విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ఓటర్ నమోదుకు ఎన్నికల కమిషన్ సంవత్సరంలో 4 సార్లు అవకాశం కల్పిస్తున్నట్లు, జనవరి 1వ. తేదీన, ఏప్రిల్ 1వ. తేదీన, జూలై 1వ. తేదీన, అక్టోబర్ 1వ. తేదీన అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఓటు హక్కు వినియోగం పై అందరి చేత ప్రతిజ్ఞ. చేయించారు ఈ సందర్భంగా 18 సం.లు నిండి ఓటర్ గా నమోదైన నూతన ఓటర్ లను కలెక్టర్ సన్మానించారు.
ఈ కార్యక్రమాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా,అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భాస్కర్ రావు, జడ్.పి.సి. ఈ. ఓ. ప్రేమ్ కరణ్ రెడ్డి,అర్.డి. ఓ.జయ చంద్ర రెడ్డి జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
*పత్రికా ప్రకటన*. తేది:25.01.2023,నల్గొండ ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి, అర్హులైన ఓటర్లను ఓటర్ జాబితాలో లో పేరు నమోదు చేసేలా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి సూచించారు.