ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించండి. ప్రజావాణిలో అధికారులు తప్పక హాజరు కావాలి. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

ప్రజలు  పలు సమస్యలపై ప్రజావాణిలో  అందించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని ఆదనవు కలెక్టర్ యస్. మోహన్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు.  సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ప్రజావాణిలో  వివిధ సమస్యలపై అందిన ఆర్జీలను  పరిశీలించి సత్వరమే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పక హాజరు కావాలని తెలుపుతూ  జిల్లాలో ధాన్యం కొనుగోలు  కేంద్రాలలో  వేగం పెంచాలని కొనుగోలు చేసిన  ధాన్యాన్ని ఆయా మిల్లర్లకు సత్వరమే పంపించాలని సంబందిత  అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ఎక్కువగా  భూసమస్యల దరఖాస్తులు  వచ్చాయని  తెలుపుతూ  భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు 09, వివిధ శాఖలకు సంబంధించి 10 మొత్తం 19 దరఖాస్తులు అందాయని అన్నారు.
    ఈ సమావేశంలో    పి.డి.   జ్యోతి పద్మ, శంకర్, దయానంద రాణి,డి.యస్.ఓ విజయ లక్ష్మి, పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి,  పులి సైదులు,  వివిధ శాఖల అధికారులు అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించండి.
ప్రజావాణిలో అధికారులు తప్పక హాజరు కావాలి.
అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

Share This Post