ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించండి. ఎక్కువగా భూ దరఖాస్తులు::::. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

ప్రజావాణిలో  పలు సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను సత్వరమే పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదనవు కలెక్టర్ యస్. మోహన్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు.  సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా వివిధ రకాల భూసమస్యల దరఖాస్తులు అందాయని అన్నారు. తరుచుగా జిల్లాలో  అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని జాగ్రత్తలు చేపట్టాలని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు అందించాలని అన్నారు. ప్రజావాణిలో భూసమస్యల దరఖాస్తులు 29, ఇతర శాఖలకు సంబంధించి 23 దరఖాస్తులు అందాయని అట్టి దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు.
    ఈ సమావేశంలో  ఈ. డి. యస్.సి. కార్పొరేషన్ శిరీష, పి.డి. ఐసీడీస్ జ్యోతి పద్మ, ఎడిఏ రామారావు నాయక్, ఏ. ఓ శ్రీదేవి, సూదర్శన్ రెడ్డి,  పులి సైదులు వివిధ శాఖల అధికారులు అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post