ప్రజా అవసరాలకు తగినట్లుగా పనులు చేపట్టాలి

ప్రచురణార్థం

ప్రజా అవసరాలకు తగినట్లుగా పనులు చేపట్టాలి

తొర్రూరు,
మహబూబాబాద్, సెప్టెంబర్ 30.

ప్రజా అవసరాలకు తగినట్లుగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.

గురువారం తొర్రూరు మున్సిపల్ పరిధిలో రూ 3 కోట్లతో నిర్మిస్తున్న మోడల్ మార్కెట్ను, యతి రాజారావు పార్కును, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

తొలుత పట్టణం నడిబొడ్డున జి ప్లస్ టు గా నిర్మిస్తున్న మున్సిపల్ మోడల్ మార్కెట్ పనులను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

కూరగాయల తో పాటు మాంసం విక్రయ దుకాణాలకు చేస్తున్న పనులను పరిశీలించారు. పట్టణాల విస్తరణ పట్ల అవగాహన పెంచుకోవాలని భవిష్యత్ తరాలకు సరిపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి అన్నారు మార్కెట్ పై భాగములో మీటింగ్ హాల్ నిర్మించుకోవాలని తద్వారా మున్సిపాలిటీకి ఆదాయవనరులు పెరుగుతాయని సూచించారు.

అనంతరం యతి రాజారావు పార్క్ ను సందర్శించి పరిశీలించారు.
పార్కు నిర్వాహణ అత్యంత అవసరమన్నారు త్వరితగతిన ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తు ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, మున్సిపల్ ఇంజనీర్ రంజిత్ తాసిల్దార్ రాఘవరెడ్డి రెవెన్యూ సిబ్బంది రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
—————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post