ప్రజా కవి కాళోజీ నారాయణ రావు గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు-జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్

రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 09:- గురువారం ప్రజా కవి కాళోజీ నారాయణ రావు గారి 107 జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కళోజీ గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరంత‌రం తెలంగాణ కోసం ప‌రిత‌పించిన కాళోజీ, మాన‌వీయ విలువ‌ల‌ను చాటారన్నారు. మాన‌వ‌తే కేంద్రంగా క‌విత్వాన్ని రాసి ప్రపంచ వ్యాప్తం చేశారని కాళోజీ మన తెలంగాణ బిడ్డ కావడం మనకు గర్వకారణమని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు 1992 లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందాడని, ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post