ప్రజా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించండి.:::: అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

జిల్లాలో  పలు సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను సత్వరమే పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదనవు కలెక్టర్ యస్. మోహన్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు.  సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారు ప్రజావాణి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలిం చి సత్వరమే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కువగా వివిధ రకాల భూసమస్యల దరఖాస్తులు అందాయని అన్నారు. ప్రజావాణిలో భూసమస్యలకు సంబంధించి 12 , వివిధ శాఖలకు సంబంధించి 9 మొత్తం 21 దరఖాస్తులు అందాయని అన్నారు.  జిల్లాలో తరుచుగా  అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అనుబంధ శాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు చేపట్టాలని అలాగే వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు అందించాలని అన్నారు.
    ఈ సమావేశంలో  డి.యస్.ఓ విజయలక్ష్మి, ఈ. డి. యస్.సి. కార్పొరేషన్ శిరీష, పి.డి. ఐసీడీస్ జ్యోతి పద్మ, ఎడిఏ రామారావు నాయక్,  పర్యవేక్షకులు  పులి సైదులు, సుదర్శన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post