ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సహకారంతో హనుమకొండ జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.

Press release                                                             Date 2-2-2023

ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సహకారంతో హనుమకొండ జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.

గురువారం నాడు ఉదయం 9 గంటలకు భద్రకాళి దేవాలయం సందర్శించిన అనంతరం నేరుగా

కలెక్టరేట్ కు చేరుకున్న ఆమెకు అధికారులు ఛాంబర్ లో స్వాగతం పలికారు.

అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు కలెక్టర్,అదనపు కలెక్టర్ సంధ్యా రాణి తో కలసి జిల్లా ఉన్నతిధికారులతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా నూతన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ..నిన్న జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసున్నానని తెలిపారు.జిల్లాలో పనిచేసేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వ ప్రాధాన్య పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని, అందరి సహకారంతో జిల్లాను ముందుకు నడిపిస్తానని తెలిపారు. తాను హనుమకొండ జిల్లాకు కొత్త అయినప్పటికీ, త్వరలోనే జిల్లా గురించి పూర్తిగా తెలుసుకొని గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్ల మాదిరిగానే అధికారులు, ప్రజా ప్రతినిధులసహకారం,సమన్వయంతో జిల్లాను ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లబ్దిదారులకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఫలితాలు సాధించాలి అని అన్నారు.తాను ఎల్లప్పుడూ అధికారులకు, ప్రజలకు అందుబాటులో ఉంటాను అని స్పష్టం చేసారు. సంక్షేమ పధకాల ఫలాలు క్రింది స్థాయి వరకు చేరాలంటే విస్తృతంగా క్షేత్ర పర్యటనలు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ కు dro వాసు చంద్ర,పరకాల rdo రాము, pd drda శ్రీనివాస్ కుమార్,వివిధ శాఖల అధికారులు, tgo,tngo,ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.

అనంతరం మద్యాహ్నం 12.15 నిముషాలకు సీపీ av రంగనాధ్ ను సాయంత్రం 5గంటలకు జిల్లా జడ్జి ప్రధాన న్యాయ మూర్తి కృష్ణ మూర్తి ని మర్యాద పూర్వకంగా కలిసారు.

సాయంత్రం 6 గంటలకు వరంగల్ కలెక్టర్ గోపీ, మున్సిపల్ కమీషనర్ ప్రావీణ్య కలసి కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను కలసి అభినందించారు.                                               

Share This Post