ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరు కలిసి పనిచేస్తేనే వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతం అవుతుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరు కలిసి పనిచేస్తేనే వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతం అవుతుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

శుక్రవారం కల్లెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలు నుండి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సు లో కలెక్టర్ గారితో పాటు జిల్లా శాసన సభ్యులు  కృష్ణ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సులో  పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్సు లో కలెక్టర్ మాట్లాడుతూ   తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పదిహేను రోజులపాటు కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,  18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, ప్రజా ప్రతినిధులు ఎంపీపీలు, చైర్మన్లు  జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్స్ అందరి సహకారంతో వ్యాక్సిన్ వేసుకునేలా  ప్రజలలో అవగాహన కల్పించాలని, ప్రజలు ఎలాంటి అపోహలు, భయం లేదని వారికి  అవగాహన కల్పించి నిర్ధారణ చేసి  వ్యాక్సిన్ వేయించాలని , 15 రోజుల్లో 100% వ్యాక్సినేషన్ గర్భిణి స్త్రీలు, పాల్లిచ్చేతల్లుల్లు , వృద్ధులు  ప్రతి ఒక్కరికి   వ్యాక్సిన్  తప్పనిసరిగా వేయించాలని , ఉదయమే వ్యాక్సిన్  మొదలు పెట్టలని  తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేటపుడు covid డేటా లో రిజిస్ట్రేషన్ అయ్యేటట్లు ప్లాన్ చేయాలి. మీ మీ గ్రామాలలో వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి అయితే బ్యానరు ఏర్పాటు చేసి పండుగ వాతావరణంలో ఈ ప్రోగ్రాము ను ప్రజాప్రతినిదుల సహకారం తో  సక్సెస్స్ చేయాలనీ  తెలిపారు.

 

స్తానిక శాసన సభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూరాష్ట్ర ముఖ్య మంత్రి గారు ఆరోగ్యమైన తెలంగాణా రావాలనే ఉద్దేశం తో ఈ స్పెషల్ డ్రైవ్ కర్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజా ప్రతినిదులందరూ ఎంపిటిసి లు ,ఎం పి పి లు , సర్పంచు లు అందరి సమన్వయము తో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఒక యజ్ఞం లా  చేయాలనీ,  ‌ కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకునేలా వారికీ అవగాహన కల్పించి  తప్పని సరిగా వేయించాలని , రాష్ట్రం లోనే మన జిల్లాకు మంచి పేరు వచ్చే విదంగా కృషి చేయాలనీ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ టీకాలు వేయించుకుని 100% పూర్తి చేసిన గ్రామాలకు కు నా సొంత నిధులతో గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందని  ఆయన అన్నారు.

 

ప్రజాప్రతినిధులు ,అధికారులు ప్రజలు, సమన్వయంతో కలసికట్టుగా కరోనా రహిత జిల్లా గా    రాష్ట్రంలోనే గద్వాలజిల్లా   మొదటి స్థానంలో ఉండేందుకు  కృషి చేయాలని తెలిపారు.

అదే విధంగా వీడియో కాన్ఫరెన్స్ లో అల్లంపూర్ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం మాట్లాడుతూ ఆరోగ్యమే మహా బాగ్యం  కరోనా ను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడమేనని, ప్రతి ఒక్కరు బాధ్యతగా శ్రద్ధ తీసుకొని  స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని సక్సెస్స్ చేయాలనీ కోరారు.

వీడియో కాన్ఫరెన్సు లో  అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు విజయ్, ప్రతాప్ గౌడ్, జెడ్ పి టి సి రాజశేఖర్, డి ఇ ఓ సిరాజుద్దీన్  తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి  జోగులాంబ గద్వాల్  గారిచే జారీ చేయబడినది.

 

 

Share This Post