ప్రజా ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

*ప్రజా ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం చూపాలి*

*జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

—————————–

జనహిత కార్యక్రమంలో ప్రజలు అందించిన ఫిర్యాదులు పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ఆదేశించారు.

సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన జనహిత (ప్రజావాణి) కార్యక్రమంలో అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించి మాట్లాడారు.

జనహిత సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు.
పెండింగ్ అర్జీల పై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిషన్ మోడ్ లో అన్నింటినీ పరిష్కరించాలని అన్నారు.

జనహిత లో భూ సమస్యల పరిష్కారం కోరుతూ ఎక్కువగా అర్జీలు వస్తున్నందున
రెవెన్యూ ఫిర్యాదులు, వినతుల పై
రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. వీటితో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ధరణి కి వచ్చే దరఖాస్తుల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టీ పరిష్కారం చూపాలన్నారు.
అలాగే జనహితలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి, తీసుకున్న చర్యల నివేదికను 15 రోజుల్లోగా పిటిషనర్‌కు తెలియజేయాలని, తీసుకున్న చర్యల నివేదికను జనహిత పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

కాగా సోమవారం భూ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 29 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.
జనహిత కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీఓ శ్రీనివాస్ రావు, AO బి గంగయ్య,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో వచ్చిన అర్జీలు శాఖల వారీగా
Revenue – 18
Employment – 1
Dpo – 2
Deo – 1
MC srcl – 3
E section – 1
Survey – 1
Dmho – 2

Total – 29
—————————–

.

 

Share This Post