పత్రికా ప్రకటన తేది 23-1-20 23
ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు , తాసిల్దారులకు ఆదేశించారు.
సోమవారం ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి పిర్యాదు దారులు 85 పిర్యాదులు సమర్పించారని, వాటిలో ధరణి కి సంబంధించిన భూ సమస్యలపై 68 దరఖాస్తులు , ఆసరా పెన్షన్లు 5, మరియు ఇతర సమస్యలకు సంబంధించి 12 దరకాస్తులు వచ్చినట్లు తెలిపారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ , ఏవో యాదగిరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారిచె చేయబడినది