ప్రజా వినతులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించవలసినదిగా జిల్లా పంచాయతీ అధికారి- తరుణ్ కుమార్

ప్రజా వినతులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించవలసినదిగా జిల్లా పంచాయతీ అధికారి- తరుణ్ కుమార్

ప్రజా వినతులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించవలసినదిగా జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో డి.ఎస్.ఓ. శ్రీనివాస్ తో కలిసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూమి పట్టా మార్పిడి, భూమి సర్వే , ధరణిలో మార్పులు, భూ సమస్యలు., పోడు భూముల సమస్యలతో పాటు పింఛన్లు మంజూరు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, అంగన్వాడీ టీచర్ పోస్టు కావాలని 63 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆసరా పింఛన్లకు సంబంధించి 15, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కావాలని 10 దరఖాస్తులు రాగా మిగతావి భూ సమస్యలు, తదితర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ఆ దరఖాస్తులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ త్వరితగతిన సమస్యలు పరిష్కరించవలసినదిగా తరుణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన పరశురాములుకు మూడు చక్రాల సైకిలు ను అందజేశారు.
కొన్ని వినతులు ఇలా..
వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రమంలోని సర్వే నెంబరు 580 గుడిబండపై ఏర్పాటు చేస్తున్న కృషే మిషన్ పనులను నిలుపుదల చేయవలసినదిగా ఆ గ్రామా ప్రజలు అభ్యర్థించారు.
రోడ్డు నిర్మాణంలో పోతున్న తన భూమికి నష్టపరిహారం ఇప్పించవలసినదిగా కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి గ్రామ వాసి లింగుస్వామి విజ్ఞప్తి చేశారు.
శివంపేట గ్రామానికి చెందిన స్వయం సహాయక మహిళలు తాము ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహిస్తామని అవకాశమివ్వవలసినదిగా కోరారు.
ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు గంగయ్య, హార్టికల్చర్ ఏ.డి. నర్సయ్య, ఏడుపాయల ఈ.ఓ. శ్రీనివాస్, సిపిఒ కాసిం, అదనపు డిఆర్ డిఓ భీమయ్య, నీటిపారుదల శాఖా ఈఈ శ్రీనివాస్ రావు, డిఎమ్ అండ్ హెచ్ ఓ విజయనిర్మల, అగ్నిమాపక అధికారి అమరనాథ్ గౌడ్ తదితర జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్, సూపరింటెండెంట్ బలరాం తదితరులు పాల్గొన్నారు.

Share This Post