ప్రజా శ్రేయస్సు కోసమే వెచ్చించిన మహానుభావుడు ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ జన్మదినం కార్యక్రమం కలెక్టరేట్ ఆవరణలో

ప్రజా శ్రేయస్సు కోసమే వెచ్చించిన మహానుభావుడు ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ జన్మదినం కార్యక్రమం కలెక్టరేట్ ఆవరణలో

తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పరితపించి తన జీవితాన్ని ప్రజా శ్రేయస్సు కోసమే వెచ్చించిన మహానుభావుడు ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ కొనియాడారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా గుర్తించి అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని అన్నారు. జయశంకర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమ సింగ్ లతో కలిసి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు జరుగుతున్న అవమానాలు,అన్యాయాల పట్ల సామాన్య ప్రజానీకానికి సైతం అవగాహన కలిగించి రాజకీయ చైతన్యాన్ని రగిలించి జనహృదయ నేతగా నిలిచారని అన్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశారని , ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారని గుర్తు చేశారు. తెలాంగాణ రాష్ట్రం కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటా వారి ఆశలు, ఆశయాలకనుగుణంగా ముందుకు సాగుతూ తెలంగాణను అభివృద్ధి పధంలో పయనింపచేయుటకు అందరు కంకణ బద్దులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లతో పాటు డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, ఏ.డి. మైన్స్ జయ రాజ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డి.ఈ.ఓ. రమేష్ కుమార్, బిసి సంక్షేమాధికారి జగదీష్, ఎస్సి కార్పొరేషన్ ఈ.డి. దేవయ్య, ఎస్సి అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, తదితర జిల్లా అధికారులుజ్ పాల్గొన్నారు

Share This Post